బజాజ్ కొత్త ఈవీ  ప్లాంట్‌ రూ. 300 కోట్ల ఇన్వెస్ట్‌‌‌‌మెంట్‌‌

బజాజ్ కొత్త ఈవీ  ప్లాంట్‌ రూ. 300 కోట్ల ఇన్వెస్ట్‌‌‌‌మెంట్‌‌

న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వెహికల్స్‌‌ను తయారు చేయడానికి పుణేలోని ఆకుర్డి దగ్గర  ఓ మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్‌‌ను పెడతామని బజాజా ఆటో ప్రకటించింది. ఈ ప్లాంట్‌‌ కోసం రూ. 300 కోట్లు ఇన్వెస్ట్ చేస్తామని తెలిపింది. బజాజ్ చేతక్ పాత ప్లాంట్ ఆకుర్డి దగ్గరే ఉండడం విశేషం. ఇప్పటికే ఈ ప్లాంట్ ఏర్పాటు పనులు స్టార్టయ్యాయి.  ఈ  ప్లాంట్ కెపాసిటీ ఏడాదికి 5 లక్షల ఈవీలని కంపెనీ ఓ స్టేట్‌‌మెంట్‌‌లో పేర్కొంది. ఈవీలను లోకల్‌‌ మార్కెట్‌‌లో అమ్మడానికి, విదేశాలకు ఎక్స్‌‌పోర్ట్ చేయడానికి ఈ ప్లాంట్ సాయపడుతుందని వివరించింది.  ఈ  ప్లాంట్‌‌లో తయారైన మొదటి వెహికల్‌‌ను వచ్చే ఏడాది జూన్‌‌లో అందుబాటులోకి తెస్తామని  బజాజ్‌ ఆటో పేర్కొంది. ఈ ప్లాంట్‌‌ వలన మొత్తం 800 మందికి ఉద్యోగాలొస్తాయి. ‘పల్సర్‌‌‌‌తో 2001 లో బజాజ్‌‌ 2.0  స్టార్టయ్యింది. కొత్తగా చార్మింగ్‌‌ చేతక్‌‌తో బజాజ్‌‌ 3.0 వస్తోంది’ అని బజాజ్‌‌ ఆటో ఎండీ రాజీవ్‌‌ బజాజ్ అన్నారు.  ఈవీల కోసం తమ  రీసెర్చ్‌‌ అండ్ డెవలప్‌‌మెంట్‌‌ సెంటర్లు పనిచేస్తున్నాయని అన్నారు. సస్టయినబుల్‌‌ అర్బన్ మొబిలిటీకి తేలికపాటి ఎలక్ట్రిక్ వెహికల్స్‌‌ అవసరమనే తమ నమ్మకానికి ఈ ప్లాంట్ నిదర్శనమని రాహుల్ చెప్పారు. బజాజ్ పెట్టే ఇన్వెస్ట్‌‌మెంట్ అమౌంట్ వివిధ వెండర్ల నుంచి సమీకరిస్తారు. ఈ వెండర్లు రూ. 250 కోట్ల (33 మిలియన్ డాలర్ల) వరకు ఇన్వెస్ట్ చేస్తారని అంచనా.   ఆకుర్డి ప్లాంట్‌‌ బజాజ్ ఆటో రీసెర్చ్ అండ్ డెవలప్‌‌మెంట్ సెంటర్‌‌‌‌కు దగ్గర్లో ఏర్పటవుతోంది.