కేంద్రం రైతు సంక్షేమం లక్ష్యంగా పనిచేస్తోందన్నారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్. వారికి ప్రయోనం కలిగించేందుకే వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చిందన్నారు. ప్రధాని కిసాన్ సమ్మాన్ కార్యక్రమంలో మాట్లాడిన తోమర్ … రైతులు తమ ఆందోళనలు విరమించి ప్రభుత్వంతో చర్చలకు రావాలని కోరారు. ప్రభుత్వం ఇస్తున్న సొమ్ము నేరుగా రైతుల అకౌంట్లలోకి చేరుతుండటం మనం చూస్తున్నామని.. ఇందువల్ల రైతులకు ఎంతో లబ్ది చేకూరుతోందని ఆయన చెప్పారు. కొత్త చట్టాల ప్రాధాన్యతను రైతులు అర్ధం చేసుకుని ప్రభుత్వంతో చర్చలకు రావాలని కోరారు. త్వరలో సమస్య పరిష్కారమవుతుందన్న అశాభావాన్ని వ్యక్తం చేశారు తోమర్.
