న్యూఢిల్లీ: ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ప్రేక్షకులకు మంచి ఆఫర్ ఇస్తోంది. ఈ నెల 5 నుంచి 6వ తేదీ వరకు నెట్‌ఫ్లిక్స్‌ను అందరూ ఎంజాయ్ చేయొచ్చు. సబ్స్క్రిప్షన్ లేకుండా ఎలా స్ట్రీమింగ్ చేయాలా అని సందేహించకండి. ప్రేక్షకులు ఉచితంగా నెట్‌ఫ్లిక్స్‌ను చూడొచ్చు. ఈ మేరకు శనివారం నుంచి ఆదివారం రెండ్రోజులు ఫ్రీ స్ట్రీమింగ్ ఆఫర్‌ను ఇండియన్ యూజర్లకు నెట్‌ఫ్లిక్స్ కల్పిస్తోంది. ఈ ఆఫర్ ద్వారా నెట్‌ఫ్లిక్స్ క్యాటలాగ్లోని సినిమాలు, షోలు, డాక్యుమెంటరీలను ఫ్రీగా చూడొచ్చు. మొబైల్లో అయితే నెట్‌ఫ్లిక్స్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని, ఫోన్ నంబర్ ద్వారా సైనప్ చేయొచ్చు. డెస్క్‌టాప్ లేదా ల్యాప్‌టాప్‌లో అయితే Netflix.com/StreamFest websiteలో వెళ్లి లాగిన్ అవ్వొచ్చు. అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత మూవీలు, షోలను యాక్సెస్ చేసుకోవచ్చు.
