జాతీయ,అంతర్జాతీయ మార్కెట్ లో మరిన్నిలాభాల్ని గడించేందుకు నెట్ ఫ్లిక్స్ యూజర్లకు ఆఫర్లను ప్రకటిస్తుంది. తాజాగా భారత్ తో పాటు మిగిలిన అన్నీ దేశాల్లో వీకెండ్స్ ఫ్రీ ట్రయల్స్ ను అందించేందుకు సిద్ధమైంది. తొలత ఈ ఆఫర్ భారత్ లో ప్రారంభించి..ఆ తరువాత ఇతర దేశాల్లో అందుబాటులోకి తెస్తున్నట్లు ఆ సంస్థ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ జార్జ్ పీటర్స్ తెలిపారు. తద్వారా ఆడియన్స్ నెట్ ఫ్లిక్స్ లో స్టోరీస్, వెబ్ సిరీస్ లను వీక్షించ వచ్చన్నారు.
నెట్ ఫ్లిక్స్ ను ప్రజలకు మరింత చేరువ చేసేలా కొత్త కొత్త ప్రమోషన్స్ చేస్తున్నట్లు తెలిపిన ఫీటర్..ప్రస్తుతం వీకెండ్ ఫ్రీ ఆఫర్ ను అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రయోగం సక్సెస్ అయితే మరిన్ని ఆఫర్స్ ప్రకటిస్తామన్నారు. కాగా డిసెంబర్ 4వ తేదీ నుంచి ఈ ఆఫర్ నెట్ ఫ్లిక్స్ అమల్లోకి రానుంది. వారంలో రెండు రోజుల పాటు ఈ ఆఫర్ ను వినియోగించుకోవచ్చు.
