యూజ‌ర్స్ కు నెట్ ఫ్లిక్స్ బంప‌ర్ ఆఫ‌ర్ : 83 ఏళ్ల పాటు ఫ్రీ సబ్ స్క్రిప్ష‌న్

యూజ‌ర్స్ కు నెట్ ఫ్లిక్స్ బంప‌ర్ ఆఫ‌ర్ : 83 ఏళ్ల పాటు ఫ్రీ సబ్ స్క్రిప్ష‌న్

ప్ర‌ముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఫ్రీ స‌బ్ స్క్రిప్ష‌న్ ఇచ్చేందుకు సిద్ధ‌మైంది. 83 సంవ‌త్స‌రాల నుంచి 1000 నెల‌ల వ‌రకు పొంద‌వ‌చ్చు. అయితే అందుకోసం మీరు చేయాల్సింద‌ల్లా ఒక్క‌టే. “ది ఓల్డ్ గార్డ్” వీడియో గేమ్ ‌లో అత్యధిక స్కోర్ చేయాలి.

నెట్‌ఫ్లిక్స్ చార్లీజ్ థెరాన్ నటించిన ది ఓల్డ్ గార్డ్ మూవీని గత వారం విడుదల చేసింది. థెరాన్ ప్లేట్లు ఆండీ ను త‌న సిబ్బంది నుంచి కాపాడాలి. అలా కాపాడిన యూజ‌ర్స్ కు 83 సంవత్సరాలు నెట్‌ఫ్లిక్స్ ఫ్రీ స‌బ్ స్క్రిప్ష‌న్ ను పొందుతారు.

ఓల్డ్ గార్డ్ గేమ్ లో పెద్ద, డబుల్ బ్లేడెడ్ గొడ్డలితో సాధ్యమైనంత వ‌ర‌కు ఎక్కువ మంది శత్రువులను హ‌త‌మార్చాలి. ష‌ర‌తుల ప్ర‌కారం ఆ గేమ్ ఆడితే ఉచితంగా నెట్ ఫ్లిక్స్ ఫ్రీస‌బ్ స్క్రిప్ష‌న్ పొంద‌వ‌చ్చు. అయితే ఈ గేమ్ ఆడే సమ‌యంలో శ‌త్రువుల నుంచి మీరు త‌ప్పించుకుంటూ స్కోర్ చేయాల్సి ఉంది. స్కోర్ చేసే స‌మ‌యంలో శ‌త్రువులు మీ పై దాడి చేస్తే స్కోర్ త‌గ్గి పోతుంది. కాబ‌ట్టి శ‌త్రువులు మీపై దాడి చేయ‌కుండా చూసుకోవాలి.
అయితే ఈ వీడియో గేమ్‌ను జులై 17 8గంటల నుంచి జులై 19వరకు ఆడే వినియోగదారులను ఉచిత సేవల ఆఫర్‌ వర్తిస్తుందని సంస్థ పేర్కొంది.