Netflixs: 20 ఏళ్లుగా నెట్ఫ్లిక్స్ సీఈఓగా ఉన్న రీడ్ రాజీనామా

Netflixs: 20 ఏళ్లుగా నెట్ఫ్లిక్స్ సీఈఓగా ఉన్న రీడ్ రాజీనామా

నెట్ ఫ్లిక్స్ కో ఫౌండర్ రీడ్ హేస్టింగ్స్ సీఈఓ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు సంస్థ ప్రకటించింది. 20 ఏళ్లుగా సీఈఓ పదవిలో ఉన్న రీడ్.. నెట్ ఫ్లిక్స్  అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాడు. ఇటీవల్ నెట్ ఫ్లిక్స్ 230 మిలియన్ సబ్ స్క్రైబర్లకు చేరుకుంది. అందులోనూ రీడ్ పాత్ర ఉంది. సంస్థ తీసుకోవాల్సిన నిర్ణయాలు, మార్కెటింగ్ వంటి అంశాలపై రీడ్ తీసుకున్న నిర్ణయాలే నెట్ఫ్లిక్స్ ని ఈ స్థాయిలో నిలబెట్టాయి.

ప్రస్తుతం రీడ్ స్థానాన్ని సీఓఓ గ్రెగ్ పీటర్స్ భర్తీ చేయనున్నాడు. ఈ వారం చివర్లో లేదా వచ్చేవారంలో సీఈఓ బాధ్యతలను అందుకోనున్నాడు. అయితే, ఇప్పటికే కో--సీఈఓగా ఉన్న టెడ్ శారండోస్ అదే పదవిలో కొనసాగుతున్నాడు. మరోవైపు సీఈఓగా తప్పుకున్న రీడ్.. ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.