ఫిలిప్పీన్స్‌‌లో అడుగుపెడుతున్న నెఫ్రోప్లస్‌‌

ఫిలిప్పీన్స్‌‌లో అడుగుపెడుతున్న నెఫ్రోప్లస్‌‌

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: సిటీకి చెందిన డయాలసిస్‌‌‌‌ నెట్‌‌‌‌వర్క్‌‌‌‌ నెఫ్రోప్లస్‌‌‌‌ ఫిలిప్పీన్స్‌‌‌‌ కంపెనీ రాయల్‌‌‌‌ కేర్‌‌‌‌‌‌‌‌ డయాలసిస్‌‌‌‌ సెంటర్స్‌‌‌‌(ఆర్‌‌‌‌‌‌‌‌సీడీసీ)లో మెజార్టీ వాటాను కొనుగోలు చేసింది. ఈ డీల్‌‌‌‌ విలువను కంపెనీ బయటపెట్టలేదు. వచ్చే ఐదేళ్లలో ఫిలిప్పీన్స్‌‌‌‌లో అతిపెద్ద డయాలసిస్‌‌‌‌ నెట్‌‌‌‌వర్క్‌‌‌‌గా ఎదిగేందుకు ఈ డీల్ ఉపయోగపడుతుందని నెఫ్రో ప్లస్‌‌‌‌ ఫౌండర్ విక్రమ్‌‌‌‌ ఉప్పాలా  అన్నారు. ఆర్‌‌‌‌‌‌‌‌సీడీసీకి ఫిలిప్పిన్స్‌‌‌‌లో ఆరు డయాలసిస్‌‌‌‌  సెంటర్లున్నాయి. ప్రస్తుతం 400 మంది పేషెంట్లకు ఈ సెంటర్లు  ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ ఇస్తున్నాయి. ఈ సెంటర్లను వచ్చే ఐదేళ్లలో 50 కి పెంచాలని నెఫ్రోప్లస్‌‌‌‌ టార్గెట్‌‌‌‌గా పెట్టుకుంది. ప్రస్తుతం నెఫ్రోప్లస్‌‌‌‌కు ఇండియాలో 230 డయాలసిస్‌‌‌‌  సెంటర్లున్నాయి.