నేపాల్​ సైన్యాధిపతికి భారత సైన్యంలో జనరల్​ హోదా

నేపాల్​ ప్రధాన సైన్యాధికారి జనరల్​ అశోక్​ రాజ్ సిగ్డెల్​కు భారత సైన్యంలో గౌరవ జనరల్​ హోదాను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రదానం చేశారు. గత నెలలో భారత సైన్యాధిపతి ఉపేంద్ర ద్వివేదిని నేపాల్​ సైన్యంలో గౌరవ జనరల్​ హోదాతో నేపాల్​ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్​ సత్కరించారు. 

రెండు దేశాలు తమ ప్రధాన సైన్యాధికారులను 1950 నుంచి ఇలా పరస్పరం గౌరవించుకుంటున్నాయి. సైన్యాధికారిగా అసమాన ప్రావీణ్యం కనబర్చి, భారత్​– నేపాల్​ బంధాన్ని మరింత పటిష్టం చేయడానికి జనరల్​ సిగ్డెల్​ పాటుపడ్డారు. రెండు దేశాల మధ్య ఉన్న చిరకాల, వ్యూహాత్మక రక్షణ సంబంధాలను బలోపేతం చేసేందుకు ఇది దోహదపడుతుంది.