చంద్రబాబుకు షాక్: వైసీపీలో చేరిన టీడీపీ కీలక నేత

ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో పొలిటికల్ హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు అభ్యర్థుల జాబితా ప్రకటించి ప్రచారం కూడా ముమ్మరం చేయటంతో రాష్ట్రంలో ఎన్నికల హడావిడి ఊపందుకుంది. ఈ క్రమంలో సీటు దక్కని నేతల ఫిరాయింపులు కూడా ఊపందుకున్నాయి. ఇప్పటికే పలువురు కీలక నేతలు పార్టీ మారిన క్రమంలో తాజాగా నెల్లూరు టీడీపీకి చెందిన కీలక నేత వైసీపీలో చేరారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి తన అనుచరులతో కలిసి జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.

నెల్లూరు వైసీపీకి చెందిన కీలక నేతలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీలో చేరి ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేస్తున్న నేపథ్యంలో జిల్లాలో పట్టు కోసం వీలైనంత మంది టీడీపీ నేతలను తమవైపు తిప్పుకునేందుకు ప్లాన్ చేసింది వైసీపీ. ప్రస్తుతం జగన్ నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర నెల్లూరులోకి ప్రవేశిచిన నేపథ్యంలో మరికొంత మంది టీడీపీ నేతలు వైసీపీలో చేరే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. 

ALSO READ :- ఏఐ సిటీ కోసం 200 ఎకరాలు కేటాయించాం : మంత్రి శ్రీధర్ బాబు