మనదేశంలోనే కాదు కొన్ని ప్రపంచ దేశాల్లో లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. కొన్ని దేశాల్లో నిత్యవసరా లకు సంబంధించిన షాప్‌లు తప్ప మిగతా షాప్‌లు మూత పడ్డాయి. వైన్ షాప్‌లు కూడా మూతపడటంతో మందుబాబులు పరిస్థితి దారుణంగా తయారైంది. రోజు మద్యం సేవించడం అలవాటు ఉన్నవారికి ఒక్కసారిగా మందు దొరక్కపోవడంతో తట్టుకోలేకపోతున్నారు. మద్యానికి బానిసైన ఒక్కరిద్దరు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారనే ఘనటల్ని మనం చూస్తూనే ఉన్నాం.
ఆ కోవకే చెందారు ఆస్ట్రేలియా మందుబాబులు. హోం క్వారంటైన్ లో ఉంటే మద్యం లేకపోవడంతో పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. ఆ విషయం వాళ్లకి అర్ధం అయ్యింది కాబోలు వెంటనే సమీపం దూరంలో తమ ఫ్రెండ్ , డైరక్టర్ జో మిగ్నోన్ కు ఫోన్ చేసి మందు పంపించు తట్టుకోలేకపోతున్నాం అంటూ మొరపెట్టుకున్నారు. అయితే ఆ డైరక్టర్ ఇంట్లో మందుబాటిల్ ఉంది. బయటకి వెళ్లి తన స్నేహితులకు ఇద్దామంటే ఓవైపు కరోనా వైరస్..మరోవైపు పోలీసుల పహారా. దీంతో ఏం పాలు పోని ఫ్రెండ్ ఓ ఉపాయం ఆలోచించాడు. తన వద్ద ఉన్న డ్రోన్ సాయంతో రెండు గ్లుసుల్లో జానీ వాకర్ విస్కీ నింపి సమీపంలో ఉన్న తన ఇద్దరి ఫ్రెండ్స్ కు పంపించాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Sharing a drink with our neighbours while keeping a social distance.“To use this video in a commercial player or in broadcasts, please email licensing@storyful.com”
Posted by Joe Mignone on Friday, March 27, 2020
