ఐసీసీ హాల్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ఫేమ్‌‌‌‌‌‌‌‌లో నీతూ డేవిడ్‌‌‌‌‌‌‌‌

దుబాయ్‌‌‌‌‌‌‌‌ : ఇండియా విమెన్స్‌‌‌‌‌‌‌‌ మాజీ క్రికెటర్‌‌‌‌‌‌‌‌, లెఫ్టార్మ్‌‌‌‌‌‌‌‌ స్పిన్నర్‌‌‌‌‌‌‌‌ నీతూ డేవిడ్‌‌‌‌‌‌‌‌కు.. ప్రతిష్టాత్మక ‘ఐసీసీ హాల్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ఫేమ్‌‌‌‌‌‌‌‌’లో చోటు దక్కింది. దీంతో ఇండియా తరఫున ఈ ఘనత సాధించిన రెండో విమెన్‌‌‌‌‌‌‌‌ క్రికెటర్‌‌‌‌‌‌‌‌గా ఆమె రికార్డులకెక్కింది. గతేడాది డయానా ఎడుల్జీకి ఈ అరుదైన గౌరవం లభించింది. నీతూతో పాటు ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌ మాజీ కెప్టెన్‌‌‌‌‌‌‌‌ అలిస్టర్‌‌‌‌‌‌‌‌ కుక్‌‌‌‌‌‌‌‌, సౌతాఫ్రికా లెజెండ్‌‌‌‌‌‌‌‌ ఏబీ డివిలియర్స్‌‌‌‌‌‌‌‌కు కూడా ఈ గౌరవం దక్కింది. ఈ ముగ్గుర్ని హాల్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ఫేమ్‌‌‌‌‌‌‌‌లో చేర్చుతున్నట్లు ఐసీసీ బుధవారం ప్రకటించింది. యూపీకి చెందిన నీతూ ప్రస్తుతం ఇండియా విమెన్స్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌ చీఫ్‌‌‌‌‌‌‌‌ సెలెక్టర్‌‌‌‌‌‌‌‌గా పని చేస్తున్నారు.

1995–2008 మధ్య కాలంలో ఇండియా తరఫున 10 టెస్ట్‌‌‌‌‌‌‌‌లు ఆడిన ఆమె 41 వికెట్లు తీసింది. ఇక 97 వన్డేల్లో 141 వికెట్లు పడగొట్టింది. ఇండియా తరఫున వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌‌‌‌‌‌‌‌గా నిలిచింది. అలాగే వన్డేల్లో వంద వికెట్లు తీసిన తొలి బౌలర్‌‌‌‌‌‌‌‌గా రికార్డులకెక్కింది. 1995లో ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌తో జరిగిన ఓ టెస్ట్‌‌‌‌‌‌‌‌లో 8/53తో సంచలన ప్రదర్శన చేసింది.

2006లో ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌ క్రికెట్‌‌‌‌‌‌‌‌కు గుడ్‌‌‌‌‌‌‌‌బై చెప్పిన నీతూ మరో రెండేళ్ల తర్వాత దాన్ని వెనక్కి తీసుకుని ఆసియా కప్‌‌‌‌‌‌‌‌, ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌ టూర్‌‌‌‌‌‌‌‌లో బరిలోకి దిగింది. 2013లో చివరి డొమెస్టిక్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌ ఆడిన నీతూ 2012–13లో రైల్వేస్‌‌‌‌‌‌‌‌కు సీనియర్‌‌‌‌‌‌‌‌ విమెన్స్‌‌‌‌‌‌‌‌ టీ20 లీగ్‌‌‌‌‌‌‌‌ టైటిల్‌‌‌‌‌‌‌‌ను అందించింది.