నీట్ పరీక్ష ఏర్పాట్లు పూర్తి

నీట్ పరీక్ష ఏర్పాట్లు పూర్తి

వైద్య విద్య (యూజీ) నీట్ 2022-23 ప్రవేశాల కోసం ఈనెల 17న పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదివారం మధ్యాహ్నం 2 నుంచి 5.20 గంటల వరకు పరీక్ష నిర్వహించడం జరుగుతుందని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ప్రకటించింది. పరీక్షా సమయాన్ని 20 నిమిషాలు పెంచారు. మొత్తం 200 ప్రశ్నలకు 200 నిమిషాల సమయాన్ని ఇచ్చారు. ఇందులో 180 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. రాష్ట్రంలోని ఆదిలాబాద్, భూపాలపల్లి, ఆసిఫాబాద్, గద్వాల, జగిత్యాల, భూపాలపల్లి, జనగామ, కొత్తగూడెం, మహబూబాబాద్, హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, రంగారెడ్డి, వరంగల్, సంగారెడ్డి, మంచిర్యాల, మెదక్, మేడ్చల్, నల్గొండ, మహబూబ్ నగర్, హయత్ నగర్, నిజామాబాద్, సిద్ధిపేట, సూర్యాపేట, వికారాబాద్ తో సహా మొత్తం 25 పట్టణాల్లోని 115 కేంద్రాల్లో నీట్ ను నిర్వహించనున్నారు. తెలంగాణాలో సుమారు 60 వేల మంది విద్యార్థులు పరీక్షను రాయనున్నారు. 

విద్యార్థులకు సూచనలు

  • విద్యార్థులు అడ్మిట్ కార్డు, ఇతర పత్రాలను పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లాలి.
  • గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి.
  • పాస్ పోర్టు సైజు ఫోటో, చెల్లుబాటయ్యే గుర్తింపు కార్డు తీసుకెళ్లాలి. 
  • మాస్క్ తప్పనిసరి. 
  • ముక్కు పిన్ లు, గొలుసులు, ఉంగరాలు,  గాగుల్స్, హ్యాండ్ బ్యాగ్ లు, బ్రాస్ లెట్లు, చెవి పోగులు, బ్యాడ్జ్ లు, హెయిర్ బ్యాండ్ లు, తాయెత్తులతో పాటు ఇతర అభరణాలను ధరించరాదు.
  • సాధారణ చెప్పులు మాత్రమే వేసుకోవాలి. 
  • బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్ను ఉపయోగించాలి.