నీట్ ఎగ్జామ్.. అభ్యర్థులు పాటించాల్సిన నిబంధనలివే..!

నీట్ ఎగ్జామ్.. అభ్యర్థులు పాటించాల్సిన నిబంధనలివే..!

వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్‌ యూజీ పరీక్ష ఇవాళ(మే7) దేశవ్యాప్తంగా జరగనుంది.  నీట్ యూజీ కి దేశవ్యాప్తంగా  మొత్తం 18.72 లక్షల మంది వరకు అభ్యర్థులు దరఖాస్తు చేయగా రాష్ట్రం నుంచి దాదాపు 70వేల మంది పరీక్ష రాస్తున్నారు.  రాష్ట్రంలో హైదరాబాద్ సహా 24 ప్రధాన  పట్టణాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.  మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు పరీక్ష జరగనుంది. పరీక్షా కేంద్రాల వద్ద  మెటల్ డిటెక్టర్లతో  తనిఖీ నిర్వహించనున్నారు.
 
అభ్యర్థులు పాటించాల్సిన నిబంధనలివే..!

  •  అభ్యర్థులు అరగంట ముందే పరీక్షా కేంద్రాల్లోకి ప్రవేశించాలి. మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత లోనికి అనుమతించరు.
  •  అభ్యర్థులు డ్రెస్‌ కోడ్ తప్పనిసరిగా పాటించాలి.
  • పొడవు చేతులున్న డ్రెస్సులు, షూలు, నగలు, మెటల్‌ వస్తువులను లోనికి అనుమతించరు.
  • స్లిప్పర్లు..తక్కువ ఎత్తున్న శాండిల్స్‌ మాత్రమే వేసుకోవాలి.
  • పేపర్లు..జామెట్రీ, పెన్సిల్‌ బాక్సులు, ప్లాస్టిక్‌ పౌచ్‌లు, కాలిక్యులేటర్లు, స్కేళ్లు, రైటింగ్‌ ప్యాడ్స్‌, పెన్‌డ్రైవ్స్‌,  ఎలక్ట్రానిక్‌ పెన్నులు వంటి వాటిని పరీక్ష కేంద్రానికి అనుతించరు.
  • చేతికి వాచ్‌లు, వాలెట్లు,  హ్యాండ్‌బ్యాగ్‌లు, బెల్ట్‌లు, టోపీలు వంటివి ధరించకూడదు.
  • ఎలక్ట్రానిక్‌ వస్తువులను అనుమతి లేదు.
  • అభ్యర్థులు పరీక్ష రాసేందుకు అవ‌స‌ర‌మైన‌ బాల్‌ పాయింట్‌ పెన్నును పరీక్ష గదిలోనే ఇవ్వనున్నారు.