రాష్ట్రంపై రూ. 7 లక్షల కోట్ల అప్పుతో పాటు రూ. 40 వేల కోట్ల బిల్లుల భారం

  • దివాలా తీయించిన వారే విమర్శించడం విడ్డూరంగా ఉంది
  • మంత్రి పొన్నం ప్రభాకర్ ‌‌‌‌‌‌‌‌

గద్వాల, వెలుగు : తెలంగాణ రాష్ట్రంపై రూ. 7 లక్షల కోట్ల అప్పు భారంతో పాటు, రూ. 40 వేల కోట్ల బిల్లుల భారం కూడా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ ‌‌‌‌‌‌‌‌ చెప్పారు. శుక్రవారం గద్వాల జిల్లా కేంద్రంలో సర్దార్ ‌‌‌‌‌‌‌‌ పాపన్నగౌడ్ ‌‌‌‌‌‌‌‌ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ‌‌‌‌‌‌‌‌గా శ్రీనివాసులు ప్రమాణస్వీకార కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానిక కృష్ణవేణి చౌరస్తాలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన టైంలో మిగులు బడ్డెట్ ‌‌‌‌‌‌‌‌తో ఉన్న తెలంగాణను పదేండ్లలో అప్పుల కుప్పగా మార్చారని విమర్శించారు.

రూ. 7 లక్షల కోట్ల అప్పులు చేయడమే కాకుండా వివిధ రకాల పనులు చేసిన వారికి ఎంబీ రికార్డులు, బిల్లుల రూపంలో రూ. 40 వేల కోట్లు పెండింగ్ ‌‌‌‌‌‌‌‌లో పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని దివాలా తీయించిన వారు ఇప్పుడు అవాకులు చవాకులు పేలుతున్నారని ఎద్దేవా చేశారు. దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా తెలంగాణ ప్రభుత్వం రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేసిందన్నారు. రూ. లక్ష కూడా మాఫీ చేయలేని వారు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.

ఫీజు రీయింబర్స్ ‌‌‌‌‌‌‌‌మెంట్ ‌‌‌‌‌‌‌‌ బకాయి ఉందంటూ స్టూడెంట్లను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫీజు రీయింబర్స్ ‌‌‌‌‌‌‌‌మెంట్ ‌‌‌‌‌‌‌‌ బకాయిలు రూ. 5 వేల కోట్ల వరకు ఉంటాయని, వాయిదాల పద్ధతిలో మొత్తాన్ని చెల్లిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జడ్పీ మాజీ చైర్ ‌‌‌‌‌‌‌‌పర్సన్ ‌‌‌‌‌‌‌‌ సరిత, మున్సిపల్ ‌‌‌‌‌‌‌‌ చైర్మన్ ‌‌‌‌‌‌‌‌ బీఎస్ ‌‌‌‌‌‌‌‌.కేశవ్ ‌‌‌‌‌‌‌‌, గ్రంథాలయ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు రియాజ్ ‌‌‌‌‌‌‌‌, శంకర్ ‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.

జోగులాంబను దర్శించుకున్న మంత్రి

అలంపూర్ ‌‌‌‌‌‌‌‌లోని జోగులాంబ బాలబ్రహ్మేశ్వరస్వామిని మంత్రి పొన్నం ప్రభాకర్ ‌‌‌‌‌‌‌‌ శుక్రవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన మంత్రికి ఈవో పురేందర్ ‌‌‌‌‌‌‌‌కుమార్ ‌‌‌‌‌‌‌‌, ఆలయ కమిటీ చైర్మన్ ‌‌‌‌‌‌‌‌ నాగేశ్వర్ ‌‌‌‌‌‌‌‌రెడ్డి, ప్రధాన అర్చకుడు ఆనంద్ ‌‌‌‌‌‌‌‌శర్మ పూర్ణకుంభ స్వాగతం పలికారు. మంత్రి కుటుంబ సభ్యులు మొదటగా గణపతి, స్వామివారికి అభిషేకాలు చేశారు. అనంతరం జోగులాంబ అమ్మవారిని దర్శించుకుని కుంకుమార్చన నిర్వహించారు.

తర్వాత అర్చకులు వేదాశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. దర్శనం అనంతరం మంత్రి మాట్లాడుతూ జోగులాంబ అమ్మవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ ‌‌‌‌‌‌‌‌కుమార్ ‌‌‌‌‌‌‌‌ ఉన్నారు.