సీఎంకు నీలం మధు గ్రాండ్​ వెల్కమ్​

మెదక్, వెలుగు : మెదక్​ జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి, టీపీసీసీ ప్రెసిడెంట్ మహేశ్  కుమార్ గౌడ్, మంత్రులు దామోదర రాజనర్సింహా, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలకు గడచిన కాంగ్రెస్​ సీనియర్​ నేత  నీలం మధు ముదిరాజ్​ ఘన స్వాగతం పలికారు.  ఏడుపాయల సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్​ వద్ద సీఎం తదితరులకు పుష్ప గుచ్చం అందించి గ్రాండ్​ వెల్కమ్​ చెప్పారు.  ఏడుపాయల వన దుర్గా భవాని మాత ఆలయంలో జరిగిన పూజల్లో, అభివృద్ధి పనుల శంకుస్థాపనల్లో, అనంతరం మెదక్​  చర్చిలో  జరిగిన శతాబ్ది వేడుకల్లో వారితో కలిసి పాల్గొన్నారు.

ఆయా కార్యక్రమాల్లో ఎంపీ సురేశ్ షెట్కర్, ఎమ్మెల్యేలు రోహిత్, సంజీవ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మతరావు, టీజీఐఐసీ  చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, డీసీసీ ప్రెసిడెంట్ ఆంజనేయులు గౌడ్, మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ  చైర్మన్ సుహాసిని రెడ్డి, నియోజకవర్గ ఇంచార్జిలు రాజీ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, పూజల హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.