కరోనా వైరస్ కారణంగా తమిళనాడులోని వండలూర్ జూపార్క్‌లో ఓ ఆడ సింహం చనిపోయింది. గత వారం ఈ సింహం అనారోగ్యానికి గురైంది. నీరసంగా ఉన్నసింహాన్ని చూసిన జూ సిబ్బంది కరోనా సోకినట్లు అనుమానించారు. శాంపిల్‌ను భోపాల్‌లోని ల్యాబ్‌కు పంపించారు. అక్కడే ఉన్న 9 సింహాల శాంపిళ్లు కూడా పాజిటివ్‌గా తేలినట్లు జూ సిబ్బంది తెలిపారు. అయితే వాటికి కరోనా ఎలా సోకిందన్న దానిపై అధికారులు విచారణ జరుపుతున్నారు. అయితే సింహం దీర్ఘకాల వ్యాధులతో చనిపోయి ఉండొచ్చని ఓ జూ అధికారి చెప్పారు. రెండో శాంపిల్‌ను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైసెక్యూరిటీ యానిమల్ డిసీజ్స్కు పంపిస్తామని తెలిపారు.
