న్యూఢిల్లీ: 2020–-21 ఆర్థిక సంవత్సరానికి (మార్చి 2021తో ముగింపు) దాదాపు 5.89 కోట్ల ఐటీఆర్‌లు (ఆదాయపు పన్ను రిటర్న్‌లు) కొత్త ఈ–-ఫైలింగ్ పోర్టల్‌లో దాఖలయ్యాయని ఐటీ శాఖ శనివారం తెలిపింది. శుక్రవారం.. అంటే డిసెంబర్ 31వ తేదీనే 46.11 లక్షలకు పైగా ఐటీఆర్‌లు అప్లోడ్ అయ్యాయని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) ఒక ప్రకటనలో తెలిపింది. జనవరి 10, 2021 నాటికి, (అసెస్మెంట్ ఇయర్ 2020-–21), దాఖలు చేసిన మొత్తం ఐటీఆర్ సంఖ్య 5.95 కోట్లని వెల్లడించింది. అసెస్మెంట్ ఇయర్ 2021-–22 కోసం 5.89 కోట్ల ఐటీఆర్‌లు అప్లోడ్ అయ్యాయి. ఐటీఆర్ ఫామ్– 1 (సహజ్) ఐటీఆర్ ఫామ్ 4 (సుగమ్).. చిన్న, మధ్యస్థ పన్ను చెల్లింపుదారులకు ఇస్తారు. రూ. 50 లక్షల వరకు ఆదాయం ఉండి, జీతం, ఇల్లు/ ఆస్తి/ఇతర వనరుల (వడ్డీ మొదలైనవి) నుండి ఆదాయాన్ని పొందే వ్యక్తి సహజ్‌ను దాఖలు చేయవచ్చు. బిజినెస్, ప్రొఫెషన్ ద్వారా మొత్తం రూ. 50 లక్షల వరకు ఆదాయం ఉన్న వ్యక్తులు, హెచ్‌యూఎఫ్‌లు, సంస్థలు ఐటీఆర్-–-4ను దాఖలు చేయొచ్చు. రెసిడెన్షియల్ ప్రాపర్టీల ద్వారా రెవెన్యూ వచ్చే వ్యక్తులు ఐటీఆర్-–-2ను ఫైల్ చేస్తారు. బిజినెస్/ప్రొఫెషన్ ద్వారా లాభాలు పొందేవారు ఐటీఆర్-–3ను, ఎల్ఎల్పీలు ఐటీఆర్–-5ను, వ్యాపార సంస్థలు ఐటీఆర్–--6ను, ట్రస్ట్‌లు ఐటీఆర్–7లను దాఖలు చేస్తారు.
