సిక్కింలో 100మంది బౌద్ధ సన్యాసులకు కరోనా

సిక్కింలో 100మంది బౌద్ధ సన్యాసులకు కరోనా

ఆరోగ్య సూత్రాలను పాటిస్తూ..ఆధ్యాత్మిక చింతనతో ఉండే బౌద్ధ సన్యాసులు కూడా కరోనా బారిన పడ్డారు. సిక్కింలోని ఆధ్యాత్మిక కేంద్రంల్లో దాదాపు 100 మంది బౌద్ధ సన్యాసులకు కరోనా పాటిజివ్ నిర్ధారణ అయింది. గ్యాంగ్ టక్ కు  30 కిలోమీటర్ల దూరంలో ఉన్న రూమ్ టెక్ సెంటర్లలో మొదట 37 మంది సన్యాసులు కరోనా బారిన పడ్డారు. ఆ తర్వాత గుంజాంగ్ మోనాస్టరీలో 61 మంది సన్యాసులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో.. ఈ కేంద్రాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు ఆరోగ్య శాఖ అధికారులు. కరోనా బారిన పడినవారిని వివిధ ఐసొలేషన్ కేంద్రాలకు తరలించారు.

ఆధ్యాత్మిక కేంద్రాల్లోకి ఎవరినీ అనుమతించబోమని గ్యాంగ్ టక్ డివిజినల్ మేజిస్ట్రేట్ తెలిపారు. రూమ్ టెక్ కేంద్రానికి ప్రపంచ హెరిటేజ్ సైట్ గా గుర్తింపు ఉంది. దేశ, విదేశాల నుంచి వేలాది మంది బౌద్ధ సన్యాసులు ఈ కేంద్రానికి వస్తుంటారు. వీరి ద్వారానే ఇక్కడి సన్యాసులకు కరోనా సోకి ఉంటుందని భావిస్తున్నారు. మరోవైపు సిక్కింలో లాక్ డౌన్ ను మరోవారం పాటు పొడిగించారు అధికారులు.