ఎన్డీయే కూటమి తరఫున రాష్ట్రపతి అభ్యర్థిత్వానికి ద్రౌపది ముర్ము జూన్ 24న (శుక్రవారం) నామినేషన్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ అభ్యర్థిత్వం కోసం ఆమె పేరును ప్రధానమంత్రి నరేంద్రమోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా ప్రతిపాదించనున్నట్లు సమాచారం. నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమానికి ఎన్డీయే కూటమిలోని అన్ని మిత్ర పక్షాలను, మిత్రపక్ష పార్టీల ముఖ్యమంత్రులను ఆహ్వానించారంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ కార్యక్రమంలో పాల్గొంటామంటూ మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా, నాగాలాండ్ సీఎం నేఫ్యూ రియో ఇప్పటికే నిర్ధారించారని కథనాలు పేర్కొన్నాయి. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కూడా దీనికి హాజరవుతారని అంటున్నారు.
NDA's presidential candidate Droupadi Murmu to file nomination on June 24
— ANI Digital (@ani_digital) June 22, 2022
Read @ANI Story | https://t.co/pg0ozU57LT#NDApresidentCandidate #NDACandidate #DroupadiMurmu pic.twitter.com/llKrRO73dQ
