చంద్రబాబు చేరికతో ఎన్డీఏ బలపడిందని ప్రధాని మోదీ అన్నారు. వికసిత్ ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించడమే మా లక్ష్యమన్నారు. వికసిత్ భారత్ తో పాటు ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ది చేయడమే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఎన్డీఏ పదేళ్ల పాలనలో పేదరికం తగ్గిందన్నారు. ఏపీ ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగ్రహం ఉందని స్పష్టంగా కనపడుతుందన్నారు.
శ్రీరాముడి గురించి గుర్తుచేసుకుంటే... ఆంధ్ర ప్రజల కళ్ల ముందు నందమూరి తారకరామారావు కనపడతారన్నారు. ఆయన పేదలకు, రైతులకు అందించిన సేవల గురించి గుర్తు చేసుకోవాలన్నారు. అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్టీ రామారావును ఎలా ఇబ్బంది పెట్టిందో తెలుసుకోవాలన్నారు. ఎన్టీఆర్శతాబ్ది ఉత్సవాల వేళ ఆయన స్మారక నాణాన్ని విడుదల చేశామన్నారు. అలాగే పీవీ నరసింహారావుకు భారతరత్న ఇచ్చి ఎన్డీఏ ప్రభుత్వం గౌరవించిందని ప్రధాని మోదీ అన్నారు.
పేదల కోసం ఎన్డీఏ పనిచేస్తుందని .. ఇది మోదీ గ్యారంటీ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ను గొప్ప విద్యాకేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు. ఆంధ్రప్రదేశ్ యువత సామర్ధ్యాన్ని వెలికితీసేందుకు అనేక చోట్ల కేంద్రం పలు విద్యాసంస్థలను ప్రారంభించిందన్నారు. ఎన్డీఏ హయాంలో ఏపీ ఎడ్యుకేషన్ హబ్ గా మారిందన్నారు. రైతుల కోసం కేంద్రం ఎన్నో పథకాలు చేపట్టిందన్నారు.
ఎన్డీఏ కూటమిలో అన్ని పార్టీలను కలుపుకొని ముందుకు పోతుందన్నారు. కాని ఇండియా కూటమిలోని పార్టీలను కాంగ్రెస్ పార్టీ వాడుకొని వదిలేస్తుందన్నారు. ఎన్నికలకు ముందే ఇండియా కూటమిలోని పార్టీలు గొడవ పడుతున్నాయంటే.. ఆ తరువాత ఎలా ఉంటుందో అర్దం చేసుకోండి అని ప్రధాని అన్నారు.