Nayanthara Dhanush: పక్క పక్కనే నయనతార, ధనుష్.. ఎడ మొహం..పెడ మొహం అంటే ఇదేనేమో!

స్టార్ హీరోయిన్ నయనతార (Nayanthara) ఇటీవలే హీరో ధనుష్‌ (Dhanush)పై సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడ్డ విషయం తెలిసిందే. నయన్ - విగ్నేష్ పెళ్లి వీడియో డాక్యుమెంటరీలో వాడిన 3 సెకన్ల క్లిప్పింగ్‌పై ఇద్దరి మధ్య వివాదం కొనసాగుతోంది.

ప్రస్తుతం నయన్ - ధనుష్ వివాదం ఇంకా ముగియని నేపథ్యంలో వీరిద్దరూ ఒకే ఫంక్షన్లో తొలిసారి ఎదురుపడ్డారు. కానీ, కనీసం ఒకరి ముఖం ఒకరు చూసుకోలేదు. ఒక్కమాటలో చెప్పాలంటే ఎడ మొహం.. పెడ మొహం అంటే ఇదేగా..! అన్నట్టు ప్రవర్తించారు. వివరాల్లోకి వెళితే..

టౌన్ పిక్చర్స్ వ్యవస్థాపకుడు ఆకాష్ భాస్కర్ వివాహానికి మొదట హీరో ధనుష్ అటెండ్ అవ్వగా.. కొద్దిసేపటికి నయనతార తన భర్త విఘ్నేశ్ శివన్‌తో వచ్చింది. ఈ వివాహ వేడుకకు వచ్చిన సినీ సెలబ్రెటీస్ కోసం ఒకేచోట సిట్టింగ్ చైర్స్ వేశారు. అయితే, వీరిద్దరూ ఒకే వరుసలో పక్క పక్కనే కూర్చోవాల్సి వచ్చింది.

ఈ క్రమంలో కనీసం ఒక్కసారైనా ఒకరికొకరు చూసుకున్నది లేదు. కెమెరా మేన్స్ కూడా వీరిద్దరూ చూసుకుంటారా లేదా అనేది ఫోకస్ చేసిన చూసుకోలేదు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోస్, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. 

నయన్ ధనుష్ వివాదం:

2022లో నయనతార - విఘ్నేష్ శివన్ చెన్నై మహాబలిపురంలోని స్టార్ హోటల్‌లో మ్యారేజ్ చేసుకున్నారు. అయితే వీరి వివాహ వీడియో  ప్రసార హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్ కు భారీ ధరకు ఇచ్చారు. వీరి మ్యారేజ్కి అయిన మొత్తం ఖర్చు రూ.10 కోట్ల కంటే తక్కువే అయినప్పటికీ.. నెట్‌ఫ్లిక్స్‌కు వివాహ వీడియో ప్రసార హక్కులను రూ.25 కోట్లకు ఇచ్చినట్టు తెలుస్తోంది.

ఈ క్రమంలో వీరి పెళ్లి వీడియోలో 'బియాండ్ ది ఫెయిరీటేల్‌లో' 'నానుమ్‌ రౌడీ దాన్‌' పాటలు వినియోగించుకోవడానికి నిర్మాత ధనుష్ పర్మిషన్ ఇవ్వలేదు. అయినా, తగిన అనుమతి లేకుండా 3 సెకన్ల వీడియో వాడారని ధనుష్.. రూ.10 కోట్లు పరిహారం చెల్లించాలంటూ నయనతారకి నోటీసులు పంపాడు. దాంతో నయన్ తనదైన శైలిలో మూడు పేజీల ఓపెన్ లెటర్ రాసి ధనుష్పై విరుచుకుపడింది. ప్రస్తుతం వీరి వివాదం కొనసాగుతోంది.