మహబూబ్​నగర్‌‌లో ఘనంగా జాతీయ విద్యార్థి దినోత్సవం

జాతీయ విద్యార్థి దినోత్సవాన్ని బుధవారం ఘనంగా జరుపుకున్నారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ మాట్లాడుతూ ఏబీవీపీ అతిపెద్ద విద్యార్థి సంస్థగా అవతరించిందని తెలిపారు.

దేశం, దేశ సంస్కృతి పరిరక్షణ, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం రాజీలేని ఉద్యమాలు నిర్వహించిందన్నారు. నరేశ్  తేజ, సతీశ్, శివ, శివసాగర్, వరుణ్ కార్తీక్, నవీన్, మహేశ్, అరవిందు, మణి, భవాని శంకర్  పాల్గొన్నారు.

Also Read : టెక్నాలజీపై స్టూడెంట్స్​ పట్టు సాధించాలి : జారే ఆదినారాయణ

మహబూబ్​నగర్​ టౌన్, వెలుగు