డిప్యూటీ సీఎంను కలిసిన నేతలు

మహబూబ్ నగర్ టౌన్, వెలుగు : జాతీయ మాలమహానాడు నేతలు శుక్రవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిశారు. జాతీయ మాలమహానాడు అధ్యక్షుడు అద్దంకి దయాకర్, ప్రధాన కార్యదర్శి బైరి రమేశ్, స్టేట్  ప్రెసిడెంట్  పిల్లి సుధాకర్, చంద్రశేఖర్, చిప్పల నర్సింగరావు, బ్యాగరి వెంకటస్వామి, 

నాయకోటి రవికాంత్, చిట్టిమల్ల సమ్మయ్య తదితరులు డిప్యూటీ సీఎంను కలిసిన వారిలో ఉన్నారు. పాదయాత్ర ముగింపు సందర్భంగా డిసెంబర్ 1న హైదరాబాద్​లో జరిగే సభ, మాలల సింహాగర్జన సభ తదితర అంశాలపై చర్చించినట్లు స్టేట్  కో ఆర్డినేటర్  బ్యాకరి వెంకటస్వామి తెలిపారు.