న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 27 గిగావాట్ల ఎనర్జీ ప్రాజెక్టులకు నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ (ఎన్‌హెచ్‌పీసీ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నేపాల్‌తోపాటు తొమ్మిది రాష్ట్రాల్లో ఇవి ఏర్పాటవుతాయని కంపెనీ సీఎండీ అభయ్ కుమార్ సింగ్ చెప్పారు. ఉత్తరప్రదేశ్, బిహార్, ఒడిశా, రాజస్థాన్, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లలో ప్రాజెక్టులను నిర్మిస్తారు. ఇలాంటి ప్రాజెక్టులపై ఆసక్తి చూపుతున్న ఇతర రాష్ట్రాలతోనూ మాట్లాడుతున్నామని వెల్లడించారు. నేపాల్ ప్రభుత్వంతో కలిసి ఆ దేశంలో హైడ్రో ప్రాజెక్టులను నిర్మిస్తామని వెల్లడించారు. ఈ ప్రాజెక్టుల కోసం రూ.13 వేల కోట్ల క్యాపెక్స్‌ను కేటాయిస్తామని చెప్పారు. ఇప్పటికే ఆరు వేల మెగావాట్ల ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతోందని సింగ్ వివరించారు.
