నాగాలాండ్ అసెంబ్లీలో ఫస్ట్‌‌‌‌ టైమ్‌‌‌‌ జనగణమన

నాగాలాండ్ అసెంబ్లీలో ఫస్ట్‌‌‌‌ టైమ్‌‌‌‌ జనగణమన

కొహీమా: నాగాలాండ్ అసెంబ్లీలో అరుదైన సంఘటన జరిగింది. ఆ రాష్ట్రం ఏర్పడిన 58 ఏండ్ల తరువాత అక్కడ జాతీయ గీతం పాడారు. నాగాలాండ్‌‌‌‌ చరిత్రలో ఫస్ట్‌‌‌‌ టైమ్‌‌‌‌ మెంబర్స్‌‌‌‌ అందరూ జనగణమన పాడారు. ఫిబ్రవరి 12 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు ముందు గవర్నర్‌‌‌‌‌‌‌‌ ఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ రవి ప్రసంగం స్టార్ట్‌‌‌‌ చేయడానికి ముందు సభ్యులంతా జాతీయ గీతం ఆలపించారు. మనకు ఇండిపెండెన్స్ వచ్చిన టైమ్‌‌‌‌లో నాగాలాండ్‌‌‌‌ అస్సాం ప్రావిన్స్‌‌‌‌లో ఉంది. అక్కడ తిరుగుబాటు, హింస ఎక్కువగా జరిగేవి. దీంతో ఆ ప్రాంతం పెద్దగా డెవలప్‌‌‌‌ కాలేదు. అయితే, 1963 డిసెంబరు 1న కొహీమా రాజధానిగా నాగాలాండ్‌‌‌‌ స్టేట్‌‌‌‌ను ఏర్పాటు చేశారు.  ‘నాగాలాండ్‌‌‌‌ అసెంబ్లీలో ఫస్ట్‌‌‌‌ టైమ్‌‌‌‌ జనగణమన పాడారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు అసెంబ్లీలో నేషనల్‌‌‌‌ ఏంథెమ్‌‌‌‌ పాడలేదు. అయితే వాటికి ప్రత్యేక కారణాలు లేవు’ అని అసెంబ్లీ కమిషనర్‌‌‌‌‌‌‌‌, సెక్రటరీ పీజే ఆంటోని తెలిపారు.