బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టు మ్యాచ్‌లో భారత యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ తనను స్లెడ్జ్ చేశాడని ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియాన్ వెల్లడించాడు. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ లో భారత్ 150 పరుగులకే ఆలౌటైంది. అయితే రెండో ఇన్నింగ్స్ లో మాత్రం బ్యాటింగ్ లో అద్భుతంగా ఆడారు. ముఖ్యంగా ఓపెనర్ జైశ్వాల్ ఆసీస్ బౌలర్లపై ఆధిపత్యం చెలాయించాడు. ఎవరినీ వదలకుండా అందరి బౌలింగ్ లో అదరగొట్టాడు. రెండో ఇన్నింగ్స్ లో ఆటతో పాటు కాస్త మాటలకు ఈ కుర్ర బ్యాటర్ పదునుపెట్టాడు.
ఆసీస్ బౌలర్ స్టార్క్ తో పాటు ఆ జట్టు సీనియర్ స్పిన్నర్ నాథన్ లియాన్ సైతం స్లెడ్జింగ్ కు గురయ్యానని స్వయంగా చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్ లో జైశ్వాల్ సెంచరీ చేసిన తర్వాత తన దగ్గరకు వచ్చాడని లియాన్ తెలిపాడు. " జైశ్వాల్ నన్ను ఒక లెజెండ్ అన్నాడు. అయితే నన్ను ఓల్డ్ అని కూడా పిలిచాడు.ఓల్డ్ అన్నందుకు నాకేం బాధగా లేదు. ఇదంతా చాలా సరదాగా అనిపించింది". అని పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్‌కు ముందు ఆస్ట్రేలియా పోడ్‌కాస్ట్‌లో నాథన్ లియాన్ వెల్లడించాడు.
Also Read:-రేపే భారత్-ఆస్ట్రేలియా డే నైట్ టెస్ట్.. టైమింగ్స్ వివరాలు ఇవే..
పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టు రెండో రోజు ఆటలో భాగంగా జైశ్వాల్, ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ స్టార్క్ ను స్లెడ్జింగ్ చేసిన సంగతి తెలిసిందే. చేశాడు. స్టార్క్ వేసిన ఓవర్లో తొలి మూడు బంతుల్లో ఒక బౌండరీతో సహా జైశ్వాల్ ఏడు పరుగులు రాబట్టాడు. ఆ తర్వాత రెండు బంతులు మిస్ అవ్వడంతో వికెట్ కీపర్ చేతుల్లోకి వెళ్లాయి. ఈ ఓవర్ లో స్టార్క్ వైపు చూస్తూ నీ బంతి చాలా స్లో గా వస్తుంది అని జైశ్వాల్ అన్నాడు. దీనికి స్టార్క్ నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. ఒక యంగ్ టీమిండియా బ్యాటర్ ఇలా ఆసీస్ బౌలర్ పై సెటైర్ వేయడం షాక్ కు గురి చేసింది.
We saw Yashasvi Jaiswal having a banter with Mitchell Starc in the Perth Test.
— Cricket.com (@weRcricket) December 5, 2024
The veteran Aussie spinner, Nathan Lyon revealed the youngster also had a go at him. ? #BGT2025 pic.twitter.com/PFhSOrpLFd