పోలీస్ స్టేషన్ లోనే కాల్చుకుని చనిపోయిన పోలీస్ అధికారి

పోలీస్ స్టేషన్ లోనే కాల్చుకుని చనిపోయిన పోలీస్ అధికారి

మహారాష్ట్రలోని నాసిక్ లో విషాదం చోటుచేసుకుంది. ఓ పోలీస్ అధికారి  పోలీస్ స్టేషన్లోనే తన సర్వీస్ రివాల్వర్ తోనే కాల్చుకోవడం కలకలం రేపుతోంది. 
అసలేంద జరిగిందంటే.. అంబాద్ పోలీస్ స్టేషన్‌కు చెందిన పోలీస్ ఇన్‌స్పెక్టర్ అశోక్ నాజన్ ఫిబ్రవరి 20 ఉదయం పోలీస్ స్టేషన్‌లో డ్యూటీల్ జాయిన్ అయిన అనంతరం  తన  సర్వీస్ రివాల్వర్‌తో తలపై కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.  నజన్ ఎందుకు రివాల్వర్ తో కాల్చుకున్నాడనేది తెలియాల్సి ఉంది. 

 ఈ విషయం తెలుసుకున్న  పోలీస్ కమిషనర్ సందీప్ కార్నిక్, క్రైమ్ బ్రాంచ్ అసిస్టెంట్ ప్రశాంత్ బచావో అంబాద్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నాజన్ ఆత్మహత్యకు కుటుంబ కారణాలా?లేక ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నాయా.?ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.