అందరూ బుమ్రా అంటారు కానీ, పస లేదు.. మా బౌలర్ అతనికంటే గొప్ప: పాక్ పేసర్

బూమ్.. బూమ్.. బుమ్రా.. ఈ పేరెత్తితేనే ప్రత్యర్థి జట్టు బ్యాటర్లలో వణుకు పుట్టాల్సిందే. కళ్లు చెదిరే యార్కర్లకు తోడు అవుట్‌ స్వింగ్‌, ఇన్‌స్వింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్లకు ముచ్చెమటలు పట్టించగల సమర్థుడు మన బుమ్రా. అలాంటిది భారత ప్రధాన పేసర్ కంటే.. తమ సహచరుడు గొప్పోడని ఓ పాక్ బౌలర్ గంభీరాలు పలికాడు. బుమ్రా కంటే నసీమ్ షా ఉత్తమ బౌలర్ అని పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ ఇహ్సానుల్లా చెప్పుకొచ్చాడు. ఈ వ్యాఖ్యలు నెట్టింట పెద్ద దుమారేన్నే రేపుతున్నాయి. 

బుమ్రా బంతిని రెండు విధాలుగా స్వింగ్ చేయగల సామర్థ్యం, ఖచ్చితత్వం అతన్ని అంతర్జాతీయ క్రికెట్‌లో బలమైన శక్తిగా మార్చాయి. ఒక్కమాటలో చెప్పాలంటే.. అతను జట్టులో ఉన్నాడంటే భారత బ్యాటింగ్ లైనప్ కంటే బౌలింగ్ బలంగా ఉన్నట్లు లెక్క. భారత క్రికెట్ జట్టుపై అతని ప్రభావం అలాంటిది. ముఖ్యంగా విదేశీ పర్యటనల్లో కీలక వికెట్లు తీయడంలో అతని సామర్థ్యం, ​టెస్టు క్రికెట్‌లో భారత జట్టు విజయాలకు అతనే ప్రధాన కారణమన్నా సందేహించాల్సింది లేదు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కూడా, బుమ్రా ఇప్పటికే తానేంటో నిరూపించాడు. ఐసీసీ టెస్ట్ బౌలర్స్ ర్యాంకింగ్స్‌లో నంబర్ 1 స్థానంలో ఉన్నాడు. అలాంటి బుమ్రా కంటే నసీమ్ షా బెస్ట్ బౌలరని అతని సహచరుడు ఇహ్సానుల్లా పిచ్చికూతలు కూశాడు.

Also Read :- పాక్ స్పిన్నర్ నోటి దూల.. అభిషేక్ శర్మ ఎట్లిచ్చిండో చూడండి!

"అగర్ దేఖా జాయే తో జస్ప్రీత్ బుమ్రా సే అచా బౌలర్ నసీమ్ షా హై (మీరు చూస్తే, నసీమ్ షా జస్ప్రీత్ బుమ్రా కంటే మెరుగైన బౌలర్).." అని ఇహ్సానుల్లా ఓ పోడ్‌కాస్ట్‌లో పేర్కొన్నాడు. పోనీ అక్కడితో ఆగాడా అంటే అదీ లేదు. బుమ్రా అత్యుత్తమ ప్రదర్శన గురించి అడిగినప్పుడు, ఇదిగో ఇలా నోటికొచ్చింది వాగాడు. 
 
"2021 (2022) ప్రపంచకప్‌లో కూడా నసీమ్ షా ఇలాగే రాణిస్తున్నాడు. బుమ్రా గణాంకాలు అలా లేవు. ఇప్పటికీ, నసీమ్ షా అతని కంటే మెరుగ్గా ఉన్నాడు.." అని మాట్లాడాడు. అందుకు సంబంధించిన వీడియొ నెట్టింట వైరల్ అవుతోంది. ఇహ్సానుల్లా వ్యాఖ్యలపై నెటిజన్లు సెటర్లు విసురుతున్నారు.