వరకట్న వేధింపుల కేసులో పదేండ్ల జైలు

నారాయణపేట, వెలుగు : కట్నం కోసం వేధింపులకు గురి చేసిన వ్యక్తికి పదేండ్ల జైలుశిక్షతో పాటు రూ.20 వేల జరిమానా విధిస్తూ జిల్లా జడ్జి తీర్పు చెప్పినట్లు లైజన్​ ఆఫీసర్​ బాలకృష్ణ తెలిపారు. మక్తల్​ మండలం భూత్పూర్​ గ్రామానికి చెందిన హరిజన్​ నర్సింలు, అదే గ్రామానికి చెందిన సవరమ్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. రెండు నెలల తరువాత నుంచి సవరమ్మను ఎలాంటి కట్నం లేకుండా తమ కొడుకును పెండ్లి చేసుకున్నావని

ఇపుడు రూ.2 లక్షలు, 5 తులాల బంగారం తీసుకురావాలని అత్తమామాలు ఒత్తిడి చేశారు. వేధింపులు ఎక్కువ కావడంతో సవరమ్మ భూత్పూర్​ రిజర్వాయర్​లో దూకి ఆత్మహత్మ చేసుకుంది. సవరమ్మ తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఈ కేసులో 16 మంది సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టగా, నేరం రుజువు కావడంతో ఈ మేరకు శిక్ష విధిస్తూ జిల్లా జడ్జి తీర్పు చెప్పారు.