శివ్వంపేట, వెలుగు : మండలంలోని మగ్దుంపూర్ లోని బేతాని సంరక్షణ అనాథ ఆశ్రమంలో ఉన్న 30 మంది పిల్లలకు ఆధార్ కార్డులు లేవు. దీంతో వారికి పింఛన్, రేషన్రావడం లేదు. ఈ విషయం నర్సాపూర్ కోర్టు జడ్జి అనిత దృష్టికి వెళ్లడంతో ఆమె స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని తహసీల్దార్శ్రీనివాస్ చారిని ఆదేశించారు. ఈ మేరకు మండల పరిధిలోని మాదాపూర్ ఆధార్ సెంటర్ ఇన్చార్జితో మాట్లాడి శుక్రవారం స్పెషల్ క్యాంప్ ఏర్పాటు చేశారు.
అనాథాశ్రమంలోని 22 మంది అనాథ దివ్యాంగులు, మతి స్థిమితం లేని వారిని ఆధార్సెంటర్కు తీసుకెళ్లి ఫొటోలు తీసుకుని, వివరాలు నమోదు చేశారు. కార్యక్రమంలో జీపీ సెక్రటరీ చంద్రశేఖర్, ఆధార్ రీజినల్ మేనేజర్ భవాని ప్రసాద్, అసిస్టెంట్ మేనేజర్ సంతోష్ సింగ్, ఆశ్రమం నిర్వాకుడు సజీవ వర్గీస్, సోషల్ సర్వీస్ ఇన్చార్జి వీరబాబు పాల్గొన్నారు.