ములుగులో పీడీఎస్ బియ్యం పట్టివేత

ములుగు, వెలుగు : మండలంలోని నరసన్నపేట గ్రామ శివారులో పోలీసులు పీడీఎస్​బియ్యాన్ని పట్టుకున్నారు. సోమవారం వాహన తనిఖీ చేస్తుండగా యాదాద్రి జిల్లా, పుట్టగూడెం గ్రామానికి చెందిన మాలోత్ నవీన్ ఎలాంటి అనుమతి లేకుండా 38 క్వింటాళ్ల పీడీఎస్​రైస్ తరలిస్తుండగా సీజ్​చేసినట్లు సీఐ మహేందర్ రెడ్డి తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.