కొలంబో: ఆకాశంలో పెద్ద విమాన ప్రమాదం తప్పింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ఏటీసీ) గైడెన్స్ ప్రకారం వెళ్తే భారీ ప్రాణ, ఆస్తి నష్టం జరిగేది. శ్రీలంక ఎయిర్‌లైన్స్ అధికారుల వివరాల ప్రకారం.. శ్రీలంకన్ ఎయిర్ లైన్స్ ఫ్లైట్ లండన్ నుంచి కొలంబో పోతోంది. 33వేల అడుగుల ఎత్తులో 275 మంది ప్రయాణికులతో యూ 504 ఫ్లైట్ ప్రయాణిస్తోంది. టర్కీ ఎయిర్‌స్పేస్‌లోకి ఎంటర్అయ్యాక 35వేల అడుగుల ఎత్తులో ప్రయాణించాలని అంకారా ఏటీసీ నుంచి ఆదేశాలు అందాయి. అయితే 35వేల అడుగుల ఎత్తులో బ్రిటిష్ ఎయిర్‌లైన్స్ విమానం ప్రయాణిస్తోందని, 15 మైళ్ల దూరంలోనే ఉందని అంకారా ట్రాఫిక్ కంట్రోల్‌కు సమాచారం ఇచ్చారు. ఇది పట్టించుకోని అధికారులు.. 35వేల అడుగుల ఎత్తులోనే ప్రయాణించాలని మళ్లీ రెండు సార్లు ఆదేశించారు. అయినా లంకన్ ఎయిర్లైన్స్పైలెట్లు తమ విమానాన్ని 33వేల అడుగుల ఎత్తులోనే ముందుకు నడిపించారు. చివరికి తప్పును తెలుసుకున్న అంకారా ఏటీసీ అధికారులు, తమ ఆదేశాలను వెనక్కి తీసుకున్నారు.
