కల్లు షాపులపై దాడులు..తొలిసారి ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు

గద్వాల, వెలుగు : జోగులాంబ గద్వాల జిల్లాలోని మల్దకల్​లో కల్లు షాపులపై బుధ, గురువారాల్లో నార్కోటిక్ డ్రగ్స్ ఆఫీసర్లు  దాడులు చేయడం కలకలం రేపింది. కల్లు తాగిన ఒకరికి బెంజోడియా జి వైన్స్ రిపోర్ట్ పాజిటివ్​గా రావడంతో మొదటిసారిగా ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. కల్లు అమ్మిన ధర్మేష్ గౌడు, కేశన్న గౌడ్, శ్రీధర్ గౌడ్​ను కేసులో నిందితులుగా చేర్చారు.  

వాస్తవంగా గురువారమే కేసు నమోదు అయినప్పటికీ పొలిటికల్ లీడర్లు ఇందులో ఉండడంతో వివరాలు చెప్పేందుకు వెనుకడుగు వేశారనే విమర్శలు ఉన్నాయి. ఈ కేసులో ఒత్తిడి భరించలేక గద్వాల సీఐ భీమ్ కుమార్ సెలవుపై వెళ్లారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం శాంతినగర్ సీఐ టాటా బాబుకు గద్వాల ఇన్​చార్జి బాధ్యతలు ఇచ్చారు.