ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

మరికల్/ధన్వాడ, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో యువత కీలకపాత్ర పోషించాలని నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికారెడ్డి సూచించారు. మంగళవారం మరికల్​కు చెందిన బీఆర్ఎస్​ నాయకులు పూసల్​పహాడ్​లో ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్​లో చేరారు. సూర్యమోహన్​రెడ్డి, బి వీరణ్ణ, గొల్ల కృష్ణయ్య, ఎల్​ రాములు, మాజీ ఎంపీటీసీ గోపాల్, హరీశ్ చారి ఉన్నారు.

 మరికల్​ మండలం పూసల్​పహాడ్, ధన్వాడ మండలం కిష్టాపూర్​ గ్రామాల్లో గ్రామ పంచాయతీ భవనాలకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాల అభివృద్దికి గ్రామస్తులంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. డీఆర్డీవో మొగులప్ప, ఎంపీడీవో కొండన్న, మార్కెట్​ చైర్మన్​ సదాశివారెడ్డి పాల్గొన్నారు.