భూసేకరణ పనులు పూర్తి చేయాలి : కలెక్టర్ సిక్తా పట్నాయక్

నారాయణపేట, వెలుగు: భూసేకరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. పెండింగ్​లో ఉన్న భూసేకరణ పనులపై ఆయా శాఖల అధికారులతో కలెక్టరేట్​లో ఆమె శనివారం సమీక్ష జరిపారు.

జూరాల ప్రాజెక్టుకు సంబంధించిన పునరావాస కేంద్రాలైన మక్తల్ మండలంలోని అనుగొండలో భూసేకరణ ఎంతవరకు పూర్తయిందని ఆరా తీశారు. ఇప్పుడు అక్కడ జరుగుతున్న ప్లాంటింగ్ పనులు ఏ  దశలో ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ అశోక్ కుమార్, డీఎస్ ఈ బాలరాజు,  నారాయణ పేట, మక్తల్  ఈఈ లు బ్రహ్మానంద, సంజీవప్రసాద్ పాల్గొన్నారు. తరువాత కలెక్టర్​ వైద్యారోగ్యశాఖ పై సమీక్షించారు.