ఎన్యుమరేటర్లకు సహకరించాలి : ఎమ్మెల్యే సంజీవరెడ్డి

  • సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొన్న ఎమ్మెల్యే సంజీవరెడ్డి 

నారాయణ్ ఖేడ్, వెలుగు: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కార్యక్రమాన్ని నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి బుధవారం పట్టణంలోని మార్వాడి గల్లి, మండల పరిధిలోని అంత్వార్ గ్రామంలో అధికారులతో కలిసి ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..  ప్రజలు ఎలాంటి  భయాందోళనకు గురి కాకుండా ఎన్యుమరేటర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పి సహకరించాలని కోరారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిజమైన అర్హులకు అందించాలనే లక్ష్యంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ వైస్ చైర్మన్ దారం శంకర్, మున్సిపల్ అధికారులు ఉన్నారు.