జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తాం

మద్దూరు, వెలుగు: జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తామని టీయూడబ్లూజే(ఐజేయూ)నారాయణపేట జిల్లా అధ్యక్షుడు నారాయణ రెడ్డి తెలిపారు. బుధవారం మద్దూరు మండల కేంద్రంలోని ఎంపీడీవో ఆఫీస్  మీటింగ్  హాల్​లో సంఘం మండల ప్రథమ మహాసభ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల రిపోర్టర్లకు అక్రిడిటేషన్  కార్డులు ఇచ్చే పత్రికల్లో మాత్రమే పని చేయాలని, కార్డులు ఉంటేనే ప్రభుత్వ పథకాలకు అర్హులని పేర్కొన్నారు. వార్తల పరంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తేవాలని సూచించారు. అనంతరం మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శి శివ, ట్రెజరర్​ రఘు పాల్గొన్నారు.