జగన్ రాజ్యంలో మందుబాబులే మహరాజులు

జగన్ రాజ్యంలో మందుబాబులే మహరాజులు

అమరావతి: ఏ రంగంలోనూ ఆదాయం రాబట్టలేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం.. మద్యం అమ్మకాల్లో మాత్రం దూసుకుపోతోందని అన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్. ఏప్రిల్‌ నుంచి జులై వరకు మద్యంపై వచ్చిన ఆదాయం గత ఏడాదితో పోలిస్తే 14.58% పెరిగిందంటూ ఆయన ట్విట్టర్ లో స్పందించారు. మందుబాబులూ! మందుకొట్టి మీకు మీరే మహారాజులు అయిపొమ్మంటోంది రాజన్న రాజ్యం అంటూ సెటైర్లు వేశారు లోకేశ్. జగన్ అద్భుత పాలనకు ఇదే నిదర్శనం అన్నారాయన.

“జగన్ గారూ.. జనం మెలకువతో ఉంటే.. ‘ఏంటీ దరిద్రపు పాలన’  అని అడుగుతారని ఈ స్కెచ్ వేసారా… లేకపోతే సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి.. మద్యం రాబడిని పెంచుకోవడం ఏంటి? ఇకమీదటైనా విలువలు, విశ్వసనీయత వంటి పెద్ద మాటలు మాట్లాడకండి. తాగినోడి మాటకీ, మీ హామీకి నిలకడ ఎలా ఉంటుంది చెప్పండి!” అంటూ ట్విట్టర్ లో సెటైర్లు వేశారు నారా లోకేశ్.