రాజమండ్రికి చేరుకున్న లోకేష్.. అక్టోబర్ 6న చంద్రబాబుతో ములాఖత్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్  అక్టోబర్ 5 న రాజమండ్రికి చేరుకున్నారు.  రేపు ( అక్టోబర్ 6)  చంద్రబాబుతో లోకేష్ ములాఖత్ కానున్నారు. గత నెల 9వ తేదీన ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబును ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు.ఈ కేసులో అరెస్టైన చంద్రబాబు జ్యుడిషీయల్ రిమాండ్ లో ఉన్నారు.  
20 రోజుల తర్వాత ఢిల్లీ నుంచి రాజమండ్రి విచ్చేసిన టీడీపీనేత నారా లోకేశ్‌ , శుక్రవారం( అక్టోబర్ 6) ఉదయం 11 గంటలకు సెంట్రల్‌ జైలులో చంద్రబాబుతో ములాఖత్ అవుతారు. ఆయనతోపాటు కుటుంబసభ్యులు, పార్టీ నేతలు కూడా చంద్రబాబును కలుస్తారని తెలుస్తోంది.

చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో  న్యాయ నిపుణులతో చర్చించడంతో పాటు జాతీయ రాజకీయ పార్టీలను కలిసేందుకు  నారా లోకేష్ సెప్టెంబర్  నెల 14న న్యూఢిల్లీకి వెళ్లారు. అప్పటి నుండి లోకేష్ ఢిల్లీలోనే ఉన్నారు.  ఈ నెల 9వ తేదీన మరోసారి ఢిల్లీకి వెళ్తారు.  అదే రోజున ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసుపై  చంద్రబాబు దాఖలు చేసిన ఎస్‌ఎల్‌పీ పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ జరగనుంది.