టిడిపి అధినేత చంద్రబాబు ఆరోగ్యంపై ఆయన కోడలు నారా బ్రహ్మణి ఆందోళన వ్యక్తం చేశారు. ఎపి స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టై ప్రస్తుతం రాజమండ్రి జైలు ఉన్న విషయం తెలిసిందే. జైలులో చంద్రబాబుకు సకాలంలో వైద్యం అందడంలేదని, ఆయన వయసు దృష్ట్యా మెరుగైన వైద్యం అందించాలని ఆమె కోరారు. చంద్రబాబు ఇప్పటికే ఐదు కేజీల బరువు తగ్గారని, బరువు తగ్గడం వల్ల కిడ్నీలపై ప్రభావం పడే అవకాశం ఉందన్నారు.
Also Read :- అంగళ్లు కేసులో చంద్రబాబుకు ఊరట
ప్రభుత్వం వైద్యులను భయపెట్టి రిపోర్టులు రాయిస్తోందని టిడిపి నాయకుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. చంద్రబాబకు ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యం చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబు ప్రాణాలకు హానీ తలపెట్టాలని చూస్తున్నారని.. ఈ విషయంలో కోర్టులు జోక్యం చేసుకోవాలని అచ్చెన్నాయడు పేర్కొన్నారు.