గన్నవరం ఎయిర్‌పోర్ట్ లో ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య వచ్చింది. ఈ విమానంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు భార్య భువనేశ్వరి ఉన్నారు. గన్నవరం నుంచి హైదరాబాద్ వెళ్తున్న విమానం డోర్ తెరచుకోలేదు. దీంతో కొద్దిసేపు విమానం గాల్లో చక్కర్లు కొట్టడం తీవ్ర ఆందోళన కలిగించింది. విమానాల్లో ఉన్న వారే కాకుండా ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పైలట్ మళ్లీ టేకాఫ్ చేశారు. దీంతో వీల్ బయటకు రావడంతో సేఫ్ ల్యాండింగ్ అయింది.
గాల్లో చక్కెర్లు కొట్టిన విమానం ఎట్టకేలకు ఎయిర్‌పోర్టులో దిగడంతో విమానంలో ఉన్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు.