నిజం గెల‌వాలి పేరుతో జనంలోకి భువనేశ్వరి .. ఎప్పుడంటే..

స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయ్యాక  ఆయన సతీమణి భువనేశ్వరి ఆమె ప్రజల్లోకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో భువనేశ్వరి ప్రజల్లోకి వెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెలిపారు.

నిజం గెలవాలి పేరుతో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఈ నెల 25 నుంచి ఏపీ వ్యాప్తంగా యాత్ర చేపట్టనున్నారు. చంద్రబాబు అరెస్ట్ అయ్యాక ఆవేదనతో మరణించినవారిని ఆమె పరామర్శిస్తారని టీడీపీ శ్రేణులు తెలిపారు. చంద్రగిరి నియోజకవర్గం నుంచి భువనేశ్వరి యాత్ర ఆరంభిస్తారని నారా లోకేశ్ వెల్లడించారు. యాత్ర ప్రారంభానికి ముందు భువనేశ్వరి 25వ తేదీన తిరుమల శ్రీవారిని దర్శించుకుని.. అదే రోజు నిజం గెలవాలి అనే యాత్రను ప్రారంభిస్తారు.

అక్టోబర్  23వ తేదీ సాయంత్రం నారావారిపల్లెకు నారా భువనేశ్వరి చేరుకుంటారు. 24వ తేదీన కులదైవం నాగాలమ్మకు పూజలు చేసి, పాకాల మండలం, నేండ్రగుంటకు చెందిన రైతు చిన్నబ్బనాయుడు కుటుంబాన్ని పరామర్శిస్తారు. తర్వాత పనపాకం లేక రాయలపురం ఎస్సీ కాలనీలో ఆమె భోజనం చేస్తారు.. 25వ తేదీ ఉదయం తిరుమలకు చేరుకుంటారు.. ఆ తర్వాత చంద్రగిరి సమీపంలో అగరాల నేషనల్ హైవే పక్కన అమర్నాథ్ రెడ్డి వియ్యంకుడు వెంకటరెడ్డి స్థలంలో 5 వేల మంది మహిళలతో నారా భువనేశ్వరి మీటింగ్ నిర్వహిస్తారు.

నారా భువనేశ్వరి యాత్రకు తగిన భద్రత కల్పిచాలంటూ వర్ల రామయ్య డీజీపీకి లేఖరాశారు.  చంద్రబాబు అరెస్టతో మనస్థాపం చెందిన కుటుంబాలను నారా భువనేుశ్వరి పరామర్శించనున్నారు. నిజం గెలవాలి  యాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా చర్యలు తీసుకోవాలని వర్ల రామయ్య డీజీపీకి లేఖ రాశారు.