మోసాల బాబుకు ఇవే చివరి ఎన్నికలు: జగన్​

వైసీపీ ఐదేళ్ల పాలనపై అందరితో చర్చించాలని నంద్యాల సభలో సీఎం జగన్​ అన్నారు.  ఈ ఎన్నికలు ప్రజల భవిష్యత్తును నిర్ణయిస్తాయన్నారు.  మోసాల బాబుకు ఇవే చివరి ఎన్నికలు కావాలన్నారు.  వైసీపీకి ఓటేస్తే.. మరో ఐదేళ్లు ముందుకు.. బాబుకు  ఓటేస్తే పదేళ్లు వెనక్కు ఆంధ్రప్రదేశ్​ వెళుతుందన్నారు.  

ఐదేళ్లలో వచ్చిన మార్పును గమనించాలని నంద్యాల సభలో సీఎం జగన్​ అన్నారు. కుట్రలు, కుతంత్రాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగాఉండాలన్నారు.  ఈ ఎన్నికలో మనకు జైత్రయాత్ర కావాలన్నారు. జగన్​ ను ఎదుర్కొనేందుకు తోడేళ్లు ఏకమయ్యాయన్నారు. ఇతరపార్టీలకు ఓటేసే వారు కూడా ఆలోచించాలన్నారు. లంచాలు, వివక్ష లేని పాలన అందించామన్నారు.  పౌర సేవలతోపాటు ప్రజలకు అండగా ఓ మహిళా పోలీస్ ను​ అందుబాటులో ఉంచామన్నారు. గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, స్కూల్స్​ ను వైసీపీ పాలనలో ఏర్పాటు చేశామన్నారు.  ఇవన్నీ చంద్రబాబు ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారని నంద్యాల సభలో ప్రశ్నించారు. నాడు నేడు పథకంతో  ప్రభుత్వ స్కూళ్లను అన్నీ విధాలుగా 58 నెలల్లోనే అభివృద్ది చేశామన్నారు. ప్రతి ఇంటి తలుపుతట్టి సంక్షేమాన్ని అందించామన్నారు. 

Also Read: అనపర్తి టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి - జెండాలు, సైకిల్ దగ్ధం చేసి నిరసన...