అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ‘జై బాలయ్య’ వైరల్ అవుతున్న బ్యాలెట్ పేపర్

వాషింగ్టన్ డీసీ: ఎక్కడైనా గ్యాదరింగ్ అయ్యిందంటే చాలు జైబాలయ్య అనే స్లోగన్ వినపడుతుంది. సమయం, సందర్భం లేకుండా ఈ స్లోగన్ అలా వచ్చేస్తుంది. ఆంధ్రాలో స్టార్టయిన ఈ స్లోగన్ అమెరికా దాకా పాకింది. అమెరికా ఎన్నికల్లో 'బాలయ్య' పేరు కూడా ఉంది.అమె రికాలో బ్యాలెట్ పత్రం ద్వారా.. అధ్యక్షుడిని ఎన్నుకుంటుంటారు. పోటీల్లో ఉండే..ప్రముఖ పార్టీలు కాకుండా.. థర్డ్ పార్టీగా వ్యవహరించే పోటీ దారుల్లో ఎవరినైనా ఎన్నుకోవాలంటే.. చివరి కాలమ్ లో వారి పేరు రాయాల్సి ఉంటుంది. ఈ కాలమ్ లోనే మన బాలయ్య పేరు కనిపించింది. 

ఈ బ్యాలెట్ పేపర్ కాస్తా సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. బ్యాలెట్ పత్రం ద్వారా అధ్యక్షుడిని ఎన్నుకుంటుంటారు. పోటీల్లో ఉండే ప్రముఖ పార్టీలు కాకుండా థర్డ్ పార్టీగా వ్యవహరించే పోటీ దారుల్లో ఎవరినైనా ఎన్నుకోవాలంటే.. చివరి కాలమ్ లో వారి పేరు రాయాల్సి ఉంటుంది. ఈ కాలమ్ లోనే నందమూరి బాలకృష్ణ పేరు కనిపించింది. దీంతో కొందరు ఈ బ్యాలెట్ పత్రాన్ని సోషల్ మీడియా పేజీల్లో షేర్ చేశారు. అది కాస్త వైరల్ గా మారింది. ఇలా బ్యాలెట్ పేపర్ పై బాలయ్య పేరు కనిపించడం ఇది రెండోసారి. గతంలో 2020 ఎన్నికల్లో బాలయ్యతో పాటూ జై జగన్ నినాదం కూడా కనిపించింది.