హైదరాబాద్: మాజీ భార్య, ఆమె రెండో భరత్, కొడుకుపై పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేసిన కేసులో వ్యక్తికి మరణశిక్ష విధించింది నాంపల్లి కోర్టు. నిందితుడు రాగుల సాయి మరణశిక్ష, అతనికి సహకరించిన స్నేహితుడు రాహుల్ కి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.
2022లో హైదరాబాద్ లోని నారాయణగూడకు చెందిన రాగుల సాయి..తన గర్భిణీ అయిన మాజీ భార్య, కుమారుడు, ఆమెతో సహజీవనం చేస్తున్న నాగరాజును పెట్రోల్ పోసి నిప్పింటించాడు. ఈ ఘటనలో గర్భంలో ఉన్న శిశువుతో సహా నలుగురు మృతిచెందారు.
ఈ కేసులో శుక్రవారం (డిసెంబర్ 20) విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు.. రాగుసాయి, అతని స్నేహితుడు రాహుల్ ని దోషులుగా తేల్చింది. రాగుసాయికి మరణశిక్ష, రాహుల్ కు యావజ్జీవ కారాగార శిక్ష, వెయ్యి రూపాయల జరిమాని విధిస్తూ తీర్పునిచ్చింది.
Also Read :- ముంబై టూ హైదరాబాద్ బస్సులో భారీగా డ్రగ్స్ సరఫరా
నారాయణగూడకు చెందిన రాగుల సాయి, ఆర్తి భార్యభర్తలు..వారికి కొడుకు విష్ణు ఉన్నాడు. సాయి, ఆర్తి మధ్య గత కొంత కాలంగా గొడవల కారణంగా ఇద్దరు విడాకులు తీసుకొని విడిపోయారు. విడాకులు తీసుకున్న ఆర్తి, కొడుకుతో కలిసి వేరుగా ఉంటున్న క్రమంలో సాయి స్నేహితుడైన నాగరాజును రెండో వివాహం చేసుకుంది.
అయితే నాగరాజు తన భార్య అయిన ఆర్తిని..సాయి చెల్లి అని పిలువాలని అనడంతో ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది. దీంతో సాయి మరో స్నేహితుడైన రాహుల్ తో కలిసి ఆర్తిని, నాగరాజు హత్య చేసేందుకు ప్లాన్ చేశారు.. గర్భంతో ఉన్న ఆర్తి, నాగరాజు, కొడుకు విష్ణుపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. దీంతో నలుగురు చనిపోయారు. ఈ ఘటన అప్పట్లో సంచలనం రేపింది.
ఈ ఘటనపై నారాయణ గూడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు నాంపల్లి కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈ కేసును మొదటి ప్రాధాన్యతగా తీసుకున్న నాంపల్లిక్రిమినల్ కోర్టు జడ్జి వినోద్ కుమార్ సంచలన తీర్పును వెల్లడించారు. రాగుల సాయికి మరణశిక్ష, అతని స్నేహితుడు రాహుల్ యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.