ఫేక్​ డాక్యుమెంట్స్​కేసులో.. అసిస్టెంట్​సబ్​ రిజిస్ట్రార్​అరెస్ట్

  • 14 రోజుల జ్యుడీషియల్ ​రిమాండ్​
  • భూకబ్జాకు సహకరించిందని ఆరోపణలు

జీడిమెట్ల, వెలుగు: నాంపల్లిలోని చిట్స్ & ఫైనాన్స్ రిజిస్ట్రార్ ఆఫీసులో అసిస్టెంట్ రిజిస్ట్రార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పనిచేస్తున్న జ్యోతిని జీడిమెట్ల పోలీసులు మంగళవారం అరెస్ట్​చేసి, మేడ్చల్​కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి ఆమెకు 14 రోజుల రిమాండ్​ విధించారు. ఉప్పుగూడకు చెందిన లేండ్యాల సురేశ్​కుమార్​20 ఏండ్ల కింద కుత్బుల్లాపూర్​సుభాశ్​నగర్​లో 200 గజాల స్థలం కొన్నాడు.

 తర్వాత అప్పుడప్పడు వచ్చి చూసుకుని వెళ్లేవాడు. ఈ స్థలంపై బీఆర్ఎస్​లీడర్​పద్మజారెడ్డి కన్నుపడింది. కరుణాకర్, గగణం నరేంద్ర అలియాస్​నందు, రవిశంకర్, నాగిరెడ్డి, కోమల కూమారి సహకారంతో ఫేక్​ డాక్యుమెంట్స్​తయారు చేసింది. ఆ స్థలాన్ని సూరారంలోని కుత్బుల్లాపూర్​సబ్​రిజిస్ట్రార్ ఆఫీసులో ఫిబ్రవరి 2003లో రిజిస్ట్రేషన్​చేయించింది. అందుకు అప్పటి సబ్​రిజిస్ట్రార్ జ్యోతి సాయం చేసింది. 

తర్వాత జ్యోతి కుత్బుల్లాపూర్​ నుంచి బదిలీ అయ్యింది. ప్రస్తుతం నాంపల్లిలోని చిట్స్ & ఫైనాన్స్ రిజిస్ట్రార్ ఆఫీసులో అసిస్టెంట్ రిజిస్ట్రార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా చేస్తోంది. అయితే బాధితుడు సురేశ్​ఫిర్యాదుతో ఇటీవల పద్మాజారెడ్డితోపాటు మరో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్​కి తరలించారు. విచారణలో భాగంగా జ్యోతిని జీడిమెట్ల పోలీసులు అరెస్ట్ చేశారు.