బహుజన సాహిత్యం ద్వారానే రాజ్యాధికారం

ముషీరాబాద్,వెలుగు: బహుజన సాహిత్యం ద్వారానే రాజ్యాధికారం సిద్ధిస్తుందని బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ పేర్కొన్నారు. ఆదివారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సాహిత్య అకాడమీ 7వ తెలంగాణ రాష్ట్ర సదస్సు జరిగింది.

రాష్ట్ర అధ్యక్షులు ఎం ఎం గౌతమ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి జాతీయ అధ్యక్షులు నల్ల రాధాకృష్ణ హాజరై మాట్లాడారు. రాజ్యాధికారం కోసం ప్రజల్లో చైతన్యాన్ని నింపి ముందుకు నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్, విష్ణు, బాలయోగి, ప్రభాత్ కుమార్, సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.