ఇండియా కూటమిని గెలిపించేందుకు ఏకం కావాలి : చల్లా వంశీచంద్ రెడ్డి

మహబూబ్ నగర్ టౌన్ , వెలుగు: బీజేపీ  కుల, మత వర్గాల పేరుతో విచ్చిన్నం చేస్తున్న ఈ టైంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఇండియా కూటమిని గెలిపించే దిశగా ఐక్యం కావాలని  నాగర్​కర్నూల్​ కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థి  చల్లా వంశీచంద్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం   సీపీఎం  జిల్లా ఆఫీసులో  ఆ పార్టీ లీడర్లతో నాయకులతో సమావేశమయ్యారు.  పాలమూరు అభివృద్ధి కోసం, తమకు మద్దతునివ్వాలని కోరారు.  ఈ సమావేశంలో సీపీఎం  రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జాన్ వెస్లీ, కిల్లె గోపాల్, జిల్లా కార్యదర్శి లు, వెంకట్రాములు, జబ్బార్, కురుమూర్తి  పాల్గొన్నారు. 

అలంపూర్,వెలుగు:   జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను శుక్రవారం మహబూబ్​నగర్​ కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచందర్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.  వీరికి  అర్చకులు స్వాగతం పలికారు.  గణపతి పూజ బాల బ్రహ్మేశ్వర స్వామి లో ప్రత్యేక పూజలు జోగులాంబ అమ్మవారి ఆలయంలో కుంకుమార్చనలు నిర్వహించారు.