ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను వేగంగా పరిశీలించాలి : ​కలెక్టర్ బాదావత్ సంతోష్

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను వేగంగా పరిశీలించాలని నాగర్​కర్నూల్​కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. మంగళవారం లేఔట్ రెగ్యులేషన్ స్కీమ్ ప్లాట్​ను కలెక్టర్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంబంధిత దరఖాస్తులను అధికారులందరూ క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన దరఖాస్తుల్లో న్యాయబద్ధంగా ఉన్న దరఖాస్తులను వెంటనే ఆమోదించాలని సూచించారు.

అనంతరం కలెక్టరేట్ లో కుటుంబ డిజిటల్​ కార్డుల గుర్తింపుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతి నియోజకవర్గాన్ని ఓ ప్రత్యేక అధికారి పర్యవేక్షిస్తారని తెలిపారు.  కార్యక్రమంలో డీఎల్ పీవో వరలక్ష్మి, ఏడబ్ల్యూవో వెంకన్న, ఎంపీవో భరత్ పాల్గొన్నారు.