APIIC ఛైర్ పర్సన్ గా ఆర్ కె రోజా బాధ్యతలు

APIIC ఛైర్ పర్సన్ గా ఆర్ కె రోజా బాధ్యతలు

ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ గా నగరి ఎమ్మెల్యే ఆర్ కె రోజా బాధ్యతలు చేపట్టారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ ప్రధాన కార్యాలయంలో రోజా బాధ్యతలు చేపట్టారు. తన ఛాంబర్ లో ప్రత్యేక పూజలను నిర్వహించిన  తర్వాత బాధ్యతలను స్వీకరించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ కేబినెట్ లో చోటు లభిస్తుందని రోజా భావించారు. అంతే కాదు ఆమెకు మంత్రి పదవి ఖాయమనే ప్రచారం కూడా భారీ ఎత్తున జరిగింది. అయితే ఆమెకు మంత్రి పదవి దక్కలేదు. దీంతో, ఆమె ఎంతో నిరాశకు గురయ్యారు. ఈ క్రమంలో.. ఆమెను ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ గా నియమిస్తూ సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు.

ఏపీఐఐసీ ఛైర్ పర్సన్  బాధ్యతలు చేపట్టిన రోజాకు .. ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు, అధికారులు అభినందనలు తెలిపారు.